: ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి శ్రీకారం నేడే!...జక్కంపూడిలో పైలాన్ ను ఆవిష్కరించనున్న చంద్రబాబు
ఏపీలో మరో ప్రతిష్ఠాత్మక పథకం పట్టాలెక్కనుంది. పేదలకు పక్కా నివాసాలను అందించాలన్న సంకల్పంతో టీడీపీ ప్రభుత్వం రూపొందించిన ‘ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం’ కార్యరూపం దాలుస్తోంది. కృష్ణా జిల్లాలోని జక్కంపూడిలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అక్కడ భారీ ఏర్పాట్లు జరిగాయి. అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్ ను ఆవిష్కరించడం ద్వారా ఈ పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో కొత్తగా ఆరు లక్షల గృహాలను ప్రభుత్వం నిర్మించనుంది.