: భద్రాచలంను టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతాం: సీఎం కేసీఆర్


ఖమ్మం జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం భద్రాచలంను టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. భద్రాచలం ఆలయ అభివృద్ధిపై ఆయన ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. యాదగిరి గుట్ట తరహాలో భద్రాచలంను టెంపుల్ సిటీగా మార్చాలని అధికారులకు సూచించారు. సీతారాముల ఆలయం చుట్టూ ఉన్న రహదారులను మాడ వీధులుగా తీర్చిదిద్దడానికి పరిశీలించాలని, మహాలక్ష్మి, ఆండాళ్ అమ్మవార్ల దేవాలయాలు, పర్ణశాల, చిత్రకూట మంటపం, జఠాయువు మంటపం అభివృద్ధి చేయాలని కేసీఆర్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News