: డ్రంకెన్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డితే అక్క‌డ శ‌వాల గ‌దిలోకి పంపించేస్తారు


డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఎక్కువై పోతుండ‌డం, ఎన్నిసార్లు హెచ్చ‌రించినా స‌ద‌రు వాహ‌న‌దారులు అదే తీరు క‌న‌బ‌ర్చ‌డంతో.. మ‌న ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా ప‌ట్టుబ‌డ్డ‌వారికి శిక్ష‌గా ట్రాఫిక్ విధుల్లో పాల్గొనేట్లు శిక్ష వేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే థాయ్‌లాండ్ మాత్రం డ్రంకెన్ డ్రైవ్‌కు శిక్ష‌గా ప‌ట్టుబడిన వారికి ఆసుప‌త్రి శవాల గదిలో (మార్చురీ) సేవ చేసే శిక్ష విధిస్తున్నారు. ఈ శిక్ష‌తో డ్రంకెన్ డ్రైవ్‌కు పాల్ప‌డుతున్న వారికి బుద్ధొచ్చి మారిపోతార‌ని అధికారులు చెప్తున్నారు. శవాల గ‌దిలో వారిని ఉంచ‌డం వ‌ల్ల వారికి ప్రాణం విలువ తెలిసొస్తుంద‌ని అంటున్నారు. థాయ్‌లాండ్‌లో రోడ్డు ప్ర‌మాదాల సంఖ్య గ‌ణ‌నీయంగా ఉంద‌ని డ‌బ్యుహెచ్‌వో సైతం తెలియ‌జేసింది. దీంతో ఈ శిక్ష‌తో డ్రంకెన్ డ్రైవ్‌కు పాల్ప‌డుతున్న వారికి శ‌వాల గ‌దిలో స‌ర్వీస్ చేసే శిక్ష విధించాల‌ని కేంద్ర కేబినేట్ నిర్ణ‌యించింది.

  • Loading...

More Telugu News