: లింగ వివక్ష లేకుండా టెక్కీలందరికీ సమానవేతనాలు


లింగ వివక్ష లేకుండా తమ కంపెనీల్లో పని చేసే టెక్కీలందరికీ సమానవేతనాలు అందిస్తామని సోషల్ నెట్ వర్క్ దిగ్గజం ఫేస్ బుక్, టెక్నాలజీ దిట్ట మైక్రోసాఫ్ట్ కంపెనీలు ప్రకటించాయి. ఈ సమానవేతనాలు నిన్నటి నుంచి అమల్లోకి వస్తాయని సదరు సంస్థలు వెల్లడించాయి. కాగా, బోస్టన్ కు చెందిన పెట్టుబడి సంస్థ అర్జున్ క్యాపిటల్ ఒత్తిడి మేరకే ఈ రెండు సంస్థలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయని సమాచారం. ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ తో పాటు యాపిల్ వంటి మరో 9 టెక్నాలజీ సంస్థలు తమ ఉద్యోగులకు సంబంధించిన వేతన సమాచారం వెల్లడిపై అర్జున్ క్యాపిటల్ నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ సందర్భంగా అర్జున్ క్యాపిటల్‌ పార్టనర్ నతాసా ల్యాంబ్ మాట్లాడుతూ, లింగ వివక్ష లేకుండా ప్రతిభ ఉన్న మహిళలకు అత్యున్నత పదవులు ఇవ్వడం ద్వారా పోటీ వాతావరణం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News