: మణుగూరు @ 50 డిగ్రీల సెల్సియస్
ఖమ్మం జిల్లాలోని మణుగూరు పట్టణంలో అత్యధికంగా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో, ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. బొగ్గు గని ప్రాంతం కావడంతో ఇక్కడ ఉష్ణోగ్రతలు మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువగానే ఉంటాయి. కానీ, వేసవికాలం ప్రారంభంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇక్కడి ప్రజలు భయపడుతున్నారు. కాగా, ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో ప్రజలను బయటకు రావద్దని సంబంధిత శాఖాధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే.