: ఆ కరవు ప్రాంతాల్లో 40లక్షల లీటర్ల నీటి సరఫరాకు సిద్ధం: బీసీసీఐ
మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై ఈరోజు బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న మహారాష్ట్రలో ప్రజలు తాగడానికి నీరు లేక బాధపడుతుంటే, ఐపీఎల్ మ్యాచ్‌లకు లక్షల కొద్దీ లీటర్లనెలా ఉపయోగిస్తారంటూ కొన్ని రోజుల క్రితం పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ మహారాష్ట్రలోని లాతూర్ వంటి కరవు ప్రాంతాలకు 40లక్షల లీటర్ల నీటి సరఫరా చేస్తామని కోర్టుకు చెప్పింది. ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించాలన్న అంశంపై స్పందిస్తూ.. నాగ్‌పూర్ మ్యాచ్‌లను వేరే చోటుకి మార్చేందుకు వీసీఏను సంప్రదిస్తామని బీసీసీఐ తెలిపింది. కరవు నివారణ సాయం కోసం రూ.5 కోట్లను చెల్లిస్తామని తెలిపింది.