: భవనంలోకి చొరబడ్డ చిరుత.. దానితో ఫైటింగ్ చేసిన యువకులు
ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి చిరుత ప్రవేశించింది. ఈ నేపథ్యంలో చిరుతను గమనించిన కొంతమంది యువకులు దాన్ని సెల్‌ఫోన్ కెమెరాలో బంధించడానికి ప్రయత్నించారు. దీంతో యువకులను గమనించిన చిరుత వారిలో ఒకరిపైకి దూకేసింది. యువకులందరు కలిసి కర్రలు చేతపట్టుకొని బెదిరించడంతో మళ్లీ భవనంలోకి దూరేసింది. స్వల్పగాయాలతో చిరుత దాడిచేసిన యువకుడు బయటపడ్డాడు. ఈ సన్నివేశమంతా అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయింది. ఓ డ్రామాలా సాగిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రాంతంలో ఓ చిరుత సంచరిస్తుందని, ఇక్కడికి దగ్గరలోని ఓ గ్రామంలో ఇటీవలే నలుగురు గ్రామస్థులపై దాడి చేసిందని స్థానికులు చెప్తున్నారు.