: మాల్యా రావట్లే.. ఇక ఆయన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయండి: ఈడీ
బ్యాంకులకు చెల్లిచాల్సిన కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన వ్యాపారి విజయ్ మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరింత ఫైర్ అయింది. ఐడీబీఐని మోసగించిన కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది. విజయ్ మాల్యా విచారణకు సహకరించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంపై మాల్యా పాస్‌పోర్టును రద్దు చేయాలని సంబంధిత అధికారులను కోరింది. ఇప్పటికి మూడు సార్లు నోటీసులు జారీ చేసినా విజయ్‌మాల్యా ఈడీ ముందు హాజరుకాకపోవడంతో తదుపరి చర్యలకు సిద్ధమైంది. దీంతో విజయ మాల్యాపై మరింత ఉచ్చు బిగుసుకోనుంది.