: ఫేస్‌బుక్‌లో త్వరలో కొత్త ఫీచర్.. అన్ని రకాల టికెట్లు కొనుగోలు చేసే అవకాశం
ఎప్పటికప్పుడు యూజర్ల ముందుకు కొత్త ఫీచర్‌లను తీసుకొచ్చే సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. పార్టీలు, ఈవెంట్లు, సినిమాలు, క్రికెట్ మ్యాచ్ టికెట్లను ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా కొనుగోలు చేసే ఛాన్స్ ఇస్తూ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. మొదట ఈ ఫీచర్‌ను అమెరికాలో ప్రయోగించి, ఆ తర్వాత వరల్డ్‌వైడ్‌గా తీసుకురానుంది. అత్యంత వేగవంతంగా ప్రజలకు చేరువైపోయిన ఫేస్‌బుక్‌లో ఈ ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తే ఆయా టికెట్లు కొనుగోలు విషయంలో యూజర్లకు ఎంతో అనుకూల వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు.