: న్యూయార్క్‌, లండ‌న్‌, ప్యారిస్ జాబితాలో హైద‌రాబాద్‌ను చేర్చాల‌న్న‌దే ల‌క్ష్యం: సీపీ మ‌హేందర్ రెడ్డి


న్యూయార్క్‌, లండ‌న్‌, ప్యారిస్ జాబితాలో హైద‌రాబాద్‌ను చేర్చాల‌న్న‌దే త‌మ ల‌క్ష్యమ‌ని హైద‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్ మ‌హేందర్ రెడ్డి అన్నారు. హైద‌రాబాద్‌లో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ల‌క్ష్యంలో భాగంగా ఈరోజు అంబ‌ర్‌పేట్‌లో రూ.25లక్ష‌ల వ్య‌యంతో 46 సీసీ కెమెరాలు ప్రారంభించిన సీపీ మ‌హేద‌ర్ రెడ్డి అనంత‌రం మాట్లాడారు. సీసీ కెమెరాల సాయంతో నేరాల రేటును త‌గ్గిస్తూ న‌గరాన్ని న్యూయార్క్‌, లండ‌న్‌, ప్యారిస్‌ జాబితాలో నిలుపుతామ‌న్నారు. ఇత‌ర రాష్ట్రాల నేర‌స్థులు హైద‌రాబాద్ రావాలంటే భ‌య‌ప‌డుతున్నార‌ని అన్నారు. గ‌తంతో పోల్చితే న‌గ‌రంలో 14శాతం మేర నేరాలు త‌గ్గాయ‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లో శాంతి భద్రతలు కాపాడ‌డానికి సీసీ కెమెరాలు ఎంత‌గానో ఉప‌యోగ‌క‌రంగా ఉన్నాయ‌ని అన్నారు. నేర‌స్థుల‌ను గుర్తించేందుకు సీసీ కెమెరాలు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయని చెప్పారు.

  • Loading...

More Telugu News