: నేనొక్కడినే... నా సోదరి డీకే అరుణ టీఆర్ఎస్ లోకి రారు: మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం


రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తనను ఆకర్షించాయని, బంగారు తెలంగాణ సాధన దిశగా తనవంతు కృషి చేయాలనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న ఆయన, తనను ఎవరూ ఆహ్వానించలేదని, తనంతట తానుగానే వచ్చానని తెలిపారు. తన సోదరి డీకే అరుణ టీఆర్ఎస్ పార్టీలోకి రారని వివరించారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తాము ఏ పార్టీనీ లక్ష్యంగా చేసుకోలేదని, కేసీఆర్ వెంట నడవాలన్న కోరికతోనే ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వస్తున్నారని అన్నారు. విపక్షాలు ఎలాంటి పాత్రను పోషిస్తున్నాయో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు.

  • Loading...

More Telugu News