: నాకు నిబంధనలన్నీ బాగా తెలుసు: డొనాల్డ్ ట్రంప్
మరో వారం రోజుల్లో న్యూయార్క్ రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ పార్టీలో తనకు ప్రతికూలంగా రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం తనకు ఓటర్ల నుంచి ఎదురు గాలి వీస్తున్న నేపథ్యంలో.. రిపబ్లికన్ పార్టీ నుంచి తనకు అన్యాయం జరుగుతోందని ట్రంప్ అన్నారు. రిపబ్లికన్ పార్టీ నిబంధలన్నింటినీ తనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిందన్నారు. నిబంధనలు ఎలా ఉండాలో తనకు బాగా తెలుసని ఉద్ఘాటించారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ నామినేషన్ ప్రక్రియ భారీ కుంభకోణమని, పార్టీకి ఇది సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను రిపబ్లికన్ నేషనల్ కమిటీ ఛైర్మన్ రెయిన్స్ ప్రీబస్ తిప్పికొట్టారు. నామినేషన్ ప్రక్రియ నిబంధనల గురించి పోటీ చేస్తోన్న అభ్యర్థులు అర్థం చేసుకోవాలని అన్నారు.