: నేడు ఫేస్‌బుక్ లైవ్‌ఛాట్‌లో పాల్గొననున్న దీదీ
యువత ఓట్లను రాబట్టేందుకు సామాజిక మాద్యమాన్ని మించిన ప్రచార వేదిక మరొకటి లేదని రాజకీయ నేతలందరూ భావిస్తున్నారు. అందుకే నేతలందరూ యువత ఫాలో అవుతోన్న ఆన్‌లైన్ మార్గంలోనే నడుస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఫేస్‌బుక్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే. దానికి తగ్గట్టే ఫేస్‌బుక్‌లో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీదీ ఇప్పుడు ఆ అభిమానాన్నే ఓట్లుగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీనిలో భాగంగా ఈరోజు రాత్రి 8.30 గంటలకు ఆమె ఫేస్‌బుక్ లైవ్‌ఛాట్‌లో పాల్గొననున్నారు. ఓటర్లతో లైవ్‌ఛాట్ చేస్తూ వారి సమస్యలు అడగనున్నారు, వారి నుంచి సలహాలు తీసుకోనున్నారు. తద్వారా నెటిజన్ల నుంచి ఓట్లు రాబట్టే ప్రయత్నం చేయనున్నారు.