: కేదార్ నాథ్ వరదలకు కారణం చెబుతున్న శంకరాచార్య!


మూడేళ్ల నాడు ఉత్తరాఖండ్ లోని ప్రముఖ శైవక్షేత్రం కేదార్ నాథ్ ను ముంచెత్తిన వరదలకు కారణం హనీమూన్ పేరిట వస్తున్న భార్యాభర్తలు, పిక్నిక్ పేరిట వస్తున్న యువతీ యువకులేనని శంకరాచార్య స్వామీ స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యానించారు. "దేవభూమి వంటి ప్రాంతానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆ ఆనందాన్ని అనుభవించేందుకు వస్తున్న దంపతులే కారణం. దేవుళ్ల సన్నిధిలో ఈ తరహా కార్యకలాపాలు ఆగకుంటే మరిన్ని దుర్ఘటనలు జరుగుతాయి" అని 94 ఏళ్ల స్వామీజీ వ్యాఖ్యానించారు. కాగా, శనిసింగనాపూర్ లో మహిళలను అనుమతిస్తే, దేశంలో అత్యాచారాలు పెరుగుతాయని ద్వారకా-శారదా పీఠాధిపతి శంకరాచార్య చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. శనిని మహిళలు పూజిస్తే, వారిని దురదృష్టం పలకరిస్తుందని, అత్యాచారాల వంటి ఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా శంకరాచార్య స్వామీ చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి స్పందన వస్తుందో!

  • Loading...

More Telugu News