: మరింత బలపడ్డ కెప్టెన్... మరో నాలుగు చిన్న పార్టీల చేరిక!


ఎన్నికలు జరుగుతున్న తమిళనాట రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకోవడంలో విఫలమైన చిన్న చిన్న పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. కెప్టెన్ విజయకాంత్ నేతృత్వంలో బరిలోకి దిగిన డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమిలోకి మరో నాలుగు పార్టీలు చేరనున్నట్టు తెలుస్తోంది. జయలలితతో పొత్తు చర్చలు విఫలమై, ఆ పార్టీతో కలవలేకపోయిన తమిళగ వాళ్వురిమై కట్చి (టీవీకే), తమిళగ మున్నేట్ర కళగం (టీఎంకే), మూవేందర్ మున్నేట్ర కళగం పార్టీలు డీఎండీకే వైపు వస్తున్నాయి. ఈ పార్టీల అధ్యక్షులు వేల్ మురుగన్, జాన్ పాండియన్, సేతురామన్ లు విజయకాంత్ తో జరుపుతున్న చర్చలు ఫలప్రదం కానున్నాయని, ఈ పార్టీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలన్న విషయం తేలిపోతే, పొత్తుపై ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. ఇదిలావుండగా అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధిలు అభ్యర్థుల ఎంపికలో తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News