: ప్ర‌శాంత వాతావ‌ర‌ణమే ల‌క్ష్యం.. హెచ్‌సీయూలో బయటివారి స‌భ‌లు, స‌మావేశాలు అనుమ‌తించొద్దు: హైకోర్టు ఆదేశం


హైదరాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ (హెచ్‌సీయూ)లో ప్ర‌శాంత వాతావ‌ర‌ణాన్ని పున‌రుద్ధ‌రించాల‌న్న వ్యాజ్యంపై హైకోర్టులో ఈరోజు విచార‌ణ జ‌రిగింది. వ‌ర్సిటీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొందరు ప్రయత్నిస్తున్నారని ప్రొ.గాలి వినోద్‌కుమార్ పిటిష‌న్ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. విచార‌ణ అనంత‌రం.. హెచ్‌సీయూలోకి బయటి వ్యక్తులను అనుమతించొద్దని హైకోర్టు ఆదేశించింది. యూనివర్సిటీలోకి బయట వ్య‌క్తుల‌ను అనుమ‌తిస్తే ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెలకొనడానికి విఘాతం కలిగే అవకాశాలున్నాయని కోర్టు పేర్కొంది. హెచ్‌సీయూలో బ‌య‌టి వ్య‌క్తులు ఏర్పాటు చేసే స‌భ‌లను, స‌మావేశాలను అనుమ‌తించొద్దని హైకోర్టు ఆదేశించింది. కాగా, హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మ‌హత్య త‌ర్వాత ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News