: దేశం బాగుపడేది ‘కాంగ్రెస్’ అనే పదం చచ్చిపోయినప్పుడే!: గాలి ముద్దుకృష్ణమ నాయుడు
దేశం బాగుపడేది ‘కాంగ్రెస్’ అనే పదం చచ్చిపోయినప్పుడేనని టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఉగ్రవాదం, మతతత్వం, ప్రాంతీయ వాదాలకు, బాబ్రీ మసీదు కూల్చివేతకు కాంగ్రెస్ పార్టీయే కారణమని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్, గార్డెన్ ను తొలగిస్తారని తాను అనుకోవడం లేదన్నారు. కేసీఆర్ కు రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీఆరేనని ఈ సందర్భంగా ముద్దు కృష్ణమనాయుడు గుర్తు చేశారు.