: సుజనా చౌదరికి హైకోర్టులో స్వల్ప ఊరట !


కేంద్ర మంత్రి సుజనా చౌదరికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. మారిషస్ బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని, చెల్లించకుండా ఎగ్గొట్టిన సుజనా కంపెనీల కేసులో, ఆయన ఈ నెల 26న కోర్టుకు హాజరు కావాల్సిందేనని నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ ను జారీ చేయగా, దాన్ని రద్దు చేయాలని కోరుతూ సుజనా తరఫు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు, 26కు బదులుగా మే 5న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో సుజనాకు 9 రోజుల ఊరట లభించినట్లయింది. ఇక ఆ రోజు సుజనా చౌదరి కోర్టులో హాజరై ఎన్బీడబ్ల్యూను రీకాల్ చేయించుకోకుంటే మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు.

  • Loading...

More Telugu News