: సీఆర్‌పీఎఫ్ జ‌వానుపై కాశ్మీర్‌లో అల్ల‌రి మూక‌ల‌ దాడి.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్


కాశ్మీర్‌లో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. సీఆర్‌పీఎఫ్ జవానుపై అల్ల‌రి మూక‌లు దాడికి దిగాయి. రెచ్చిపోయిన అక్క‌డి ఓ గ్యాంగ్ జ‌వానుపై దాడి చేసింది. జ‌వాను వారి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసినా.. అతని వెంటే ప‌రిగెత్తుతూ దాడి చేశారు. రాళ్ల‌తో దాడి చేస్తూ విరుచుకుప‌డ్డ అల్ల‌రిమూక‌లు ఒంట‌రిగా చిక్కిన ఓ జ‌వానుపై త‌మ ప్ర‌తాపాన్ని చూపించాయి. జ‌వాను దాడికి గుర‌వుతుండ‌గా తీసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన‌ నెటిజ‌న్లు కాశ్మీర్ అల్ల‌రి మూక‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. దాడికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News