: ఆ పోస్ట్‌బాక్స్‌తో ఫోటో దిగడానికి మహిళలు బారులు తీరారు.. అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడ్డారు!
చైనాలోని షాంఘై నగరంలో మహిళలు ఓ పోస్ట్‌బాక్స్ పక్కన నిలబడి ఫోటో దిగడానికి పోటీ పడ్డారు. రేషన్ షాపుల్లో సరుకులు తీసుకునేందుకు మన మహిళలు బారులు తీరే రీతిలో.. పోస్ట్‌బాక్స్ పక్కన నిలబడి ఫోటో దిగడానికి అక్కడి మహిళలు క్యూ కట్టేశారు. ఇంతకీ ఆ పోస్ట్‌బాక్స్‌కున్న ప్రత్యేకత ఏమిటంటారా... చైనా పాప్ సింగర్ కమ్ యాక్టర్ లూహాన్ ఇటీవలే ఈ పోస్ట్‌బాక్స్ పక్కన నిలబడి ఫోటోదిగాడు. అనంతరం ఆ ఫోటోను ఆన్‌లైన్‌లో ఉంచారు. అంతే... ఇక అప్పటినుంచి లూహాన్ మహిళా అభిమానులు ఇలా ఆ పోస్ట్‌బాక్స్‌తో ఫోటో దిగడానికి పోటీపడుతున్నారు. నిన్న సుమారు 300 మీటర్ల మేర క్యూ కనిపించింది. అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడి ఫోటోకు పోజులిచ్చారు. అభిమానులు తమ ఫేవరేట్ సినీ తారల డ్రెస్, హెయిర్ స్టైల్‌ను అనుకరించడం మామూలే. కానీ తమ అభిమాన గాయకుడు ఫోటో దిగిన పోస్ట్‌బాక్స్‌తో అభిమానులూ ఫోటో దిగాలనుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి కలిగిస్తోంది. ఇదో రకం వెర్రి అభిమానమని కొందరు కామెంట్ చేస్తున్నారు!