: మళ్లీ యాక్టివ్ అయిన జనసేన... నేడు విజయవాడలో సమావేశం!


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మార్చి 14, 2014న ప్రకటించిన జనసేన పార్టీ కార్యకర్తలు మరోసారి యాక్టివ్ అయ్యారు. గత కొంతకాలంగా పవన్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలతో, ఆయన విజయవాడ నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నేడు విజయవాడలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి పార్టీ ఆవిర్భావం తరువాత జిల్లాల వారీగా జనసేన కార్యవర్గాలు ఏర్పాటు కాగా, ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దిగక పోవడంతో, కార్యకర్తలు సైతం తమ దారిలో తాము వెళ్లిపోయారు. తిరిగి అడపా దడపా క్రియాశీలకంగా ఉన్నట్టు కనిపించినా, రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపలేకపోయారు. ఇక తాజా పరిణామాలతో పవన్ రాజకీయాల్లోకి వెంటనే రావాలన్న డిమాండ్ పెరుగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ ప్రకటనపై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు మొదలయ్యాయి. ప‌వ‌న్ టీడీపీ, బీజేపీ కూట‌మితో క‌లుస్తాడా? లేక ఆయన చూపు కాంగ్రెస్ లేదా వైకాపాలపై ఉంటుందా? 2019లో టీడీపీ, బీజేపీ విడివిడిగా పోటీ చేస్తే జనసేన దారెటు? వంటి ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానం లేనట్టే.

  • Loading...

More Telugu News