: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై ఛార్జిషీట్ దాఖలు


ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై ఛార్జిషీట్ దాఖలు చేశారు. 2013లో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో వివాదాస్పద వ్యాఖ్యల విషయమై అక్బరుద్దీన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ఈ కేసు వ్యవహారమై ఛార్జి షీట్ దాఖలు చేయలేదన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పై కొంత కాలంగా విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ పై కోర్టులో విచారణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో పోలీసులు ఈరోజు ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు హోం శాఖ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

  • Loading...

More Telugu News