: వారి గురించి మాట్లాడే వయసు, అనుభవం నాకు లేవు!: సమంతా


తన ముందున్న సూర్య, రెహమాన్, విక్రమ్ కుమార్ ల గురించి మాట్లాడేంత వయసు, అనుభవం తనకు లేవని, వారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది సమంతా. '24' సినిమా ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, ఈ సినిమాలో పని చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. ఇది సినీ నటుల కలల ప్రాజెక్ట్ అని చెప్పింది. తన మొదటి సినిమా 'ఏమాయ చేశావే'తో రెహ్మాన్ తనకు కొత్త జీవితం ఇచ్చారని గుర్తు చేసుకుంది. ఆయన ఎప్పట్లాగే అద్భుతమైన సంగీతం అందించారని చెప్పింది. ఈ సినిమాలో సూర్య మూడు పాత్రల్లో నటించారని తెలిపింది. పొద్దున్న తనతో రొమాంటిక్ సీన్ లో నటించే సూర్య, లంచ్ బ్రేక్ తరువాత తనను భయపెట్టేవారని తెలిపింది. అలాంటి పాత్రను సుర్య మాత్రమే పోషించగలరని సమంత కితాబు ఇచ్చింది.

  • Loading...

More Telugu News