: అక్కడ పనిచేయడం చాలా కష్టం... ప్రపంచంలోనే డేంజరస్ వర్క్ ప్లేస్!


ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వర్క్ ప్లేస్ ఇథియోపియాలో ఉంది. ఇథియోపియాకు ఉత్తరానున్న డనాకిల్ డిప్రెషన్ ను 'గేట్ వే ఆఫ్ హెల్'గా పేర్కొంటారు. సముద్ర మట్టానికి 300 అడుగుల దిగువనున్న ఈ ప్రదేశంలో ఉష్ణోగ్రత 60 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. ఎట్టి పరిస్థితులలోను 50 డిగ్రీలకు తగ్గదు. భూమి నుంచి ఆవిరి ఉబికి వస్తుంది. దీంతో ఇక్కడ పని చేస్తుంటే చర్మం మాడిపోతున్నట్టు ఉంటుంది. అయినా సరే అక్కడ పదుల సంఖ్యలో కూలీలు పని చేస్తుంటారు. ఇక్కడి ఉప్పు గడ్డలను తవ్వి తీసి, వాటిని ఒంటెలపై మూడు రోజుల పాటు అగ్నిపర్వతాల మధ్య ప్రయాణించి దగ్గర్లో ఉన్న బర్హలే పట్టణంలో విక్రయిస్తారు. పొద్దంతా కష్టపడితే 200 ఉప్పు గడ్డలను సేకరిస్తామని, వాటిని అమ్మితే 13 పెన్నీలు వస్తాయని వారు చెప్పారు. ఈ మధ్య వారిని ఫోటోలు తీసేందుకు వెళ్లిన ఆస్ట్రేలియా ఫోటో గ్రాఫర్ మస్సిమో రూమీ ఇది అత్యంత క్లిష్టమైన పని ప్రదేశమని చెప్పారు.

  • Loading...

More Telugu News