: ఈ ఓటమితోనే మా పని అయిపోలేదు: జహీర్ ఖాన్


కోల్ కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో ఓటమి తమకు పాఠాలు నేర్పిందని ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ తెలిపాడు. కోల్ కతాలో జహీర్ మాట్లాడుతూ, టోర్నీ ఆరంభ మ్యాచ్ ఓటమితో తమ పని అయిపోలేదని అన్నాడు. యువ ఆటగాళ్లతో కూడిన తమ జట్టు మైదానంలో పాదరసంలా కదిలిందని గుర్తుచేశాడు. డుమినిలాంటి ఆటగాడు అందుబాటులో లేకపోవడం జట్టుపై ప్రభావం చూపిందని జహీర్ తెలిపాడు. టోర్నీ ఆరంభంలో ఉండడంతో లోపాలు సరిదిద్దుకుని పుంజుకునేందుకు అవకాశం ఉందని జహీర్ చెప్పాడు. ఆటలో గెలుపోటములు సహజమని జహీర్ తెలిపాడు. తరువాతి మ్యాచుల్లో పుంజుకుంటామని జహీర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News