: ఈ వెరైటీ దొంగను పట్టిస్తే...67 వేల రూపాయల బహుమతి!


దొంగల్లో వెరైటీ దొంగలు ఉంటారనడానికి ఈ దొంగగారే నిదర్శనం. ఓ బర్గర్ వండుకుని తినడానికి గాను ఓ వ్యక్తి ఇంట్లో దూరాడితడు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బర్గర్ డెలివరీ బాయ్ ని అనుసరించిన ఓ వ్యక్తి, అతను షాప్ నుంచి వెళ్లిపోయినంత వరకు బయట వేచి వున్నాడు. అతను అలా వెళ్లగానే ఆ బర్గర్ ఆ షాపులోకి దూరాడు. ఇంట్లో వండుకున్నంత దర్జాగా బర్గర్ ను వండుకుని తిని, తర్వాత ఆ షాప్ లోని వాటర్ బాటిల్ ను కూడా తీసుకుని దర్జాగా వెళ్లిపోయాడు. ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ టీవీ పుటేజ్ లో రికార్డైంది. దీనిని చూసిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి చిత్రమైన దొంగతనాన్ని మన దేశంలో అయితే లైట్ తీసుకునేవారేమో కానీ, అక్కడ మాత్రం అలా వదిలెయ్యలేదు. అతని పుటేజ్ ను మీడియాకు విడుదల చేసిన పోలీసులు అతనిని పట్టిచ్చిన వారికి 67 వేల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు. ఇలాంటి నేరాన్ని కొలంబియా జిల్లాలో తీవ్రంగా పరిగణిస్తారు మరి!

  • Loading...

More Telugu News