: పవన్ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు: కాపు నేత ముద్రగడ
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కాపు నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. పవన్ రాజకీయాల్లోకి తనను లాగొద్దని, ప్రస్తుతం తాను కాపు జాతి కోసం పోరాడుతున్నానని అన్నారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆగస్టు వరకు గడువిచ్చిందని, ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోతే మరోసారి ఉద్యమిస్తానని ముద్రగడ హెచ్చరించారు. కాగా, నిన్న ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ తన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న విషయాన్ని ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను పోరాడతానని పవన్ కల్యాణ్ పేర్కొన్న విషయం తెలిసిందే.