: చట్టం కంటే సంప్రదాయం గొప్పదా?...ఏ ఆధారంతో వారిని అడ్డుకుంటున్నారు: సుప్రీంకోర్టు ప్రశ్న
రాజ్యాంగం, చట్టం కంటే సంప్రదాయం గొప్పదా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై దాఖలైన కేసును విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ నిబంధనలను వెనక్కి నెట్టివేసే సంప్రదాయం ఏదైనా ఉందా? అని అడిగింది. వేటి ఆధారంగా మహిళలు దేవాలయాల్లోకి వెళ్లకూడదని చెబుతున్నారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దేవుడు సర్వాంతర్యామి అని, అలాంటి దేవుణ్ణి ఎవరైనా ఆరాధించవచ్చని స్పష్టం చేసింది. అది రాజ్యాంగ హక్కు కానంతవరకు శబరిమలలో మహిళల ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోకూడదని సుప్రీంకోర్టు తెలిపింది.