: తండ్రి హోదా పొందనున్న హర్భజన్ సింగ్!
టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ తన సహచరుల కంటే ముందున్నాడు. హర్భజన్ సింగ్, దినేష్ కార్తిక్, అజింక్యా రహానే, సురేష్ రైనా, రోహిత్ శర్మ, రాబిన్ ఊతప్ప... ఇలా వరుసగా మన క్రికెటర్లు ఓ ఇంటి వాళ్లయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత నవంబర్ లో సినీ నటి గీతా బాస్రాను వివాహం చేసుకున్న హర్భజన్ సింగ్ వారి కుటుంబ సభ్యులకు తీపి కబురందించాడు. త్వరలోనే తమ ఇంటికి బుల్లి హర్భజన్ రానున్నాడని తెలిపాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా మాత్రం భజ్జీ జాగ్రత్తపడ్డాడు. అయితే ఐపీఎల్ సీజన్-9 తొలి మ్యాచ్ చూసేందుకు వచ్చిన గీతా బాస్రాను చూసిన పలువురు అనుమానం వ్యక్తం చేశారు. కొంత మంది ఆమెను నేరుగా అడిగేశారు. దానిని ఆమె దాటవేయగా, భజ్జీ సన్నిహితులు మాత్రం ఆమె గర్భవతి అని స్పష్టం చేశారు. దీంతో సహచరులందరికంటే ముందు హర్భజన్ సింగ్ తండ్రి కానున్నాడు. గీతా బాస్రా పుట్టింటికి (లండన్) వెళ్లి కొంత కాలం ఉంటుందని వారు తెలిపారు.