: బీహార్ సరిహద్దు జిల్లాల్లో నేపాల్ మద్యం!


బీహార్ లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి మందు బాబులకే కాకుండా, నైవేద్యంగా మద్యం సమర్పించే కొన్ని దేవాలయాలకు కూడా ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో, నేపాల్ సరిహద్దుల్లో ఉన్న బీహార్ లోని మద్యం ప్రియులు ఆ దేశం నుంచి మద్యం తెచ్చుకుంటున్నారు. దీంతో గత వారం రోజుల్లో మద్యం అమ్మకాలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగాయని, ఇంకా పెరిగే అవకాశముందని సరిహద్దుల్లోని హోటల్ యజమానులు చెబుతున్నారు. మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో వాటిని తయారు చేసే నేపాల్ వర్తకులు వాటి ధరను అమాంతం పెంచేశారు. కాగా, సరిహద్దు ప్రాంతంలో గస్తీ ముమ్మరం చేసి మద్యం అక్రమరవాణాను అడ్డుకునేందుకు సహకరించాలని నేపాల్ అధికారులకు బీహార్ సరిహద్దు జిల్లాల అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని నేపాల్ సరిహద్దు జిల్లాకు చెందిన అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News