: సముద్రంలో కొట్టుకుపోయిన ఆ ముగ్గురిని కాపాడిన ఉపాయం!


పసిఫిక్ మహా సముద్రంలో ఒక చిన్న పడవలో విహరించేందుకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు ప్రమాదం బారిన పడ్డారు. గత సోమవారం నాడు ఈ చిన్న పడవను ఒక పెద్ద అల తాకడంతో అది బోల్తా కొట్టి మునిగిపోయింది. దీంతో ఈ ముగ్గురు తమ ప్రాణాలు కాపాడుకునేందుకని సుమారు రెండు మైళ్ల దూరం ఈత కొట్టి, ఫనాడిక్ అనే ద్వీపం తీరానికి చేరుకున్నారు. కాగా, ఈ ముగ్గురు ప్రయాణిస్తున్న పడవ సముద్రంలో బోల్తా కొట్టిన విషయాన్ని కోస్ట్ గార్డ్ సిబ్బంది గుర్తించారు. నేవీ అధికారుల సాయంతో వారి ఆచూకీ కనుగొనేందుకుగాను, రెండు కార్గో పడవలతో గాలించారు. సుమారు 17 గంటల పాటు గాలించినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. నేవీ విమానంలో గాలిస్తున్న సిబ్బందికి ‘హెల్ప్’ అనే పెద్ద పెద్ద అక్షరాలు ఫనాడిక్ ద్వీపం తీరంలో కపపడ్డాయి. ఈ విషయమై ఆరా తీసేందుకు నేవీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. తప్పిపోయిన ఆ ముగ్గురు అక్కడ దర్శనమిచ్చారు. దీంతో గత గురువారం నాడు ఆ ముగ్గురిని సురక్షితంగా పులాప్ కు తరలించేందుకు ఒక పడవను ఏర్పాటు చేశారు. కాగా, ఫనాడిక్ ద్వీప తీరంలో చిక్కుకుపోయిన ఆ ముగ్గురికి అక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలియలేదు. దీంతో తీవ్రంగా ఆలోచించిన వారికి ఒక సూపర్ ఐడియా తట్టింది. ఆ తీరంలోనే ఉన్న తాటాకులను ఉపయోగించి ‘హెల్ప్’ అనే పెద్ద పెద్ద అక్షరాలు వచ్చేలా వాటిని అమర్చారు. ఈ ఐడియాతో వారు సురక్షితంగా అక్కడి నుంచి బయటపడ్డారు.

  • Loading...

More Telugu News