: మాకు తెలియకుండానే మా భూములు లాక్కుంటారా?... సీఆర్డీఏ ముందు ‘రాజధాని’ రైతుల ఆందోళన


నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీ సర్కారు సేకరించిన భూముల వ్యవహారంపై మరోమారు సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఆందోళన మొదలైంది. తమకు తెలియకుండానే తమ భూములు లాక్కుంటున్నారని రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక రైతులు సీఆర్డీఏ అధికారులతో వాగ్వాదానికి దిగారు. రాజధాని నిర్మాణానికి తమ భూములు ఇవ్వకున్నా వాటిలో అధికారులు సర్వే చేస్తున్నారని తెలుసుకున్న రైతులు నేటి ఉదయం విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తో వారు వాగ్వాదానికి దిగారు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ కు తమ భూములు ఇవ్వలేదని ఈ సందర్భంగా రైతులు చెప్పారు. ఈ విషయంలో కోర్టు కూడా తమకే అనుకూలంగా తీర్పిచ్చిన విషయాన్ని వారు శ్రీకాంత్ కు తెలిపారు. రాజధానికి భూములివ్వకున్నా, తమకు తెలియకుండానే తమ భూములను లాక్కునే యత్నం చేస్తున్నారని వాపోయారు. భూముల విషయంలో మరోమారు ఉండవల్లి, పెనుమాక రైతులు సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన విషయం మళ్లీ చర్చనీయాంశం అయ్యేలా వుంది.

  • Loading...

More Telugu News