: నేనెవర్నీ బెదిరించలేదు...ఎలాంటి తప్పూ చేయలేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం జిల్లాలో తెలుగుదేశం నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు మరో మలుపు తిరిగింది. శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తనను బెదిరించారని అనంతపురం డిప్యూటీ మేయర్ గంపన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న జేసీ స్పందిస్తూ, తాను ఎలాంటి బెదిరింపులకూ పాల్పడలేదని స్పష్టం చేశారు. తనవైపు నుంచి ఎలాంటి తప్పూ జరగలేదని చెప్పిన ఆయన, పోలీసుల ముందు విచారణకు తాను హాజరు కాబోనని అన్నారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలూ ప్రారంభించలేదని సమాచారం.