: ఎన్నిక ఏదైనా విజయం గ్యారంటీగా మాదే... స్వతంత్రులూ వచ్చేయండి: హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పార్టీనే విజయలక్ష్మి వరిస్తుందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. సిద్ధిపేట మునిసిపల్ ఉప ఎన్నికల్లో ఘన విజయం తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నిలిపిన అభ్యర్థులకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, గెలుపొందిన వారికి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. అభివృద్ధి కోసం కలసి రావాలని పిలుపునిచ్చారు. 16వ తేదీన సిద్ధిపేట చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను పార్టీ ప్రకటిస్తుందని హరీశ్ వెల్లడించారు.