: ఒకప్పుడు టీ అమ్ముకున్న వ్యక్తికి నేడు బీజేపీలో కీలక పోస్టు... మోదీతో దగ్గరి పోలికలు!


కేశవ్ ప్రసాద్ మౌర్య... ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు. ఆయనీ స్థానానికి రావడం అంత సులభంగా ఏమీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే, అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి కేశవ్ ప్రసాద్. ప్రధాని నరేంద్ర మోదీతో పోల్చి చూస్తే, కేశవ్ ఎన్నో దగ్గరి పోలికలను కలిగివుంటాడు. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వాటిల్లో ఒకటి... కేశవ్ టీ అమ్ముకునే స్థాయి నుంచి ఎదిగాడు. ప్రధాని మోదీలాగానే, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కేశవ్ పనిచేశారు. గతంలో ఆయన దినపత్రికలను కూడా విక్రయించేవారట. ఇక ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరో సంవత్సరంలో ఉన్న తరుణాన, కాషాయ పార్టీ కేశవ్ ప్రసాద్ మౌర్యాను పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ఓబీసీకి చెందిన కుశ్వాహ కులానికి చెందిన కేశవ్ ఎంపిక బీజేపీ అధిష్ఠానం వ్యూహాత్మక నిర్ణయమేనని రాజకీయ పండితులు భావిస్తున్నారు. యూపీలో కుశ్వాహ వర్గం ప్రజలు 8 శాతం ఉండటం, ఒకప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన ఫుల్ పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున తొలిసారిగా విజయం సాధించడం ఆయన్ను ఈ పదవికి దగ్గర చేశాయి. ఇక హిందుత్వ అంశాన్నే యూపీ ఎన్నికల్లో కీలక అస్త్రంగా చేసుకోవాలనుకుంటున్న బీజేపీ, అందుకు కేశవ్ ను ఎంచుకుంది. అయితే, తాము అభివృద్ధే ప్రధానాంశంగా ఎన్నికలకు వెళతామని కేశవ్ అంటుండటం గమనార్హం. గత శుక్రవారం నాడు ఐదు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను బీజేపీ మార్చిన సంగతి తెలిసింద.

  • Loading...

More Telugu News