: పెరోల్ ముగిసింది!... మళ్లీ జైలుకేనా అంటూ ఆత్మహత్య చేసుకున్న ఖైదీ


మెదక్ జిల్లా సంగారెడ్డి రూరల్ మండలం కంది గ్రామ సమీపంలో జీవిత ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. సదాశివపేట మండలం చందంపేటకు చెందిన మొగులయ్యగా అతడిని గుర్తించారు. వివరాల్లోకెళితే... ఓ కేసులో జీవిత ఖైదు శిక్ష పడ్డ మొగులయ్యకు ఇటీవల నెలరోజుల పాటు పెరోల్ లభించింది. పెరోల్ తో సంతోషంగా బయటకు వెళ్లిన మొగులయ్య... పెరోల్ గడువు ముగియడంతో తిరిగి జైలుకు పయనమయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు కంది సమీపంలోని జిల్లా జైలుకు కూతవేటు దూరంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News