: సిద్ధిపేట ఓట్ల లెక్కింపు పూర్తి... ఫలితాలివే!
సిద్ధిపేట మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 34 వార్డులున్న మునిసిపాలిటీలో 6 వార్డులను టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక నేటి ఓట్ల లెక్కింపు అనంతరం, టీఆర్ఎస్ 22 (ఏకగ్రీవం కలిపి), బీజేపీ 2, కాంగ్రెస్ 2, ఎంఐఎం 1, స్వతంత్రులు 7 స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాలను బట్టి 1వ వార్డులో మల్లికార్జున్ (టీఆర్ఎస్), 2వ వార్డులో లలిత (టీఆర్ఎస్), 3వ వార్డులో సంధ్య (స్వతంత్ర), 4వ వార్డులో దీప్తి (స్వతంత్ర), 5వ వార్డులో స్వప్న (స్వతంత్ర), 6వ వార్డులో భాగ్యలక్ష్మి (కాంగ్రెస్), 7వ వార్డులో ప్రశాంత్ (టీఆర్ఎస్), 8వ వార్డులో నర్సింహులు (టీఆర్ఎస్), 9వ వార్డులో ఉమారాణి (టీఆర్ఎస్), 10వ వార్డులో వేణుగోపాల్ (టీఆర్ఎస్) విజయం సాధించారు. 12వ వార్డులో అక్తర్ పటేల్ (టీఆర్ఎస్), 14వ వార్డులో శ్రీకాంత్ (బీజేపీ), 17వ వార్డులో వెంకట్ (బీజేపీ), 20వ వార్డులో జావేద్ (టీఆర్ఎస్), 22వ వార్డులో ప్రవీణ్ (స్వతంత్ర), 23వ వార్డులో తాళ్లపల్లి లక్ష్మి (టీఆర్ఎస్), 25వ వార్డులో కృష్ణ (స్వతంత్ర), 26వ వార్డులో శ్రీనివాస్ (టీఆర్ఎస్), 27వ వార్డులో విజయరాణి (స్వతంత్ర), 28వ వార్డులో ప్రభాకర్ (టీఆర్ఎస్), 30వ వార్డులో వాజీర్ (కాంగ్రెస్), 31వ వార్డులో కవిత (టీఆర్ఎస్), 33వ వార్డులో మోయిస్ (ఎంఐఎం), 34వ వార్డులో బోనాల మంజుల (స్వతంత్ర) విజయం సాధించారు.