: వైజాగ్ లో ప్రారంభమైన 'సరైనోడు' ఆడియో విజయోత్సవ వేడుక
విశాఖపట్టణంలోని సాగరతీరంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన 'సరైనోడు' ఆడియో విజయోత్సవ వేడుక ప్రారంభమైంది. మెగా ఫ్యామిలీ హీరో నటించిన సినిమా కావడంతో ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థిక రాజధాని విశాఖలో నిర్వహిస్తున్న తొలి తెలుగు స్టార్ హీరో ఆడియో విజయోత్సవ వేడుక కావడంతో భారీ ఎత్తున అభిమానులు వేడుకను వీక్షించేందుకు చేరుకున్నారు. ఈ ఆడియో వేడుకలో ఈ సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ముఖ్య అతిథిగా చిరంజీవి పాల్గొంటున్నారు. దీంతో మెగా హీరోలను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపుతున్నారు.