: ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల అసలు టార్గెట్ బ్రస్సెల్స్ కాదట!
ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల అసలు లక్ష్యం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ కాదని విచారణలో వెల్లడైంది. మహమ్మద్ అబ్రి (మిస్టరీ హ్యాట్ మ్యాన్) ని పట్టుకున్న అనంతరం బ్రస్సెల్స్ పోలీసులు అతనిని విచారించారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల అలసలు లక్ష్యం ఫ్రాన్స్ లోని పారిస్ అని తేలింది. పారిస్ దాడుల తరువాత ఫ్రాన్స్ లో కట్టుదిట్టమైన భద్రతతో అక్కడికి ఎలా చేరుకోవాలో కూడా తీవ్రవాదులకు తెలియలేదు. దీంతో అప్పటికప్పుడు వ్యూహం మార్చుకుని బెల్జియంలోని బ్రస్సెల్స్ విమానాశ్రయంలో బాంబులు పెట్టినట్టు అబ్రి వెల్లడించాడని జిన్హువా న్యూస్ తెలిపింది.