: షాకింగ్... అనంత్ అంబానీలో ఎంత మార్పు!


అనంత్ అంబానీ...ముఖేష్ అంబానీ రెండో కుమారుడు. ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ముంబై ఇండియన్స్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడ తల్లితో పాటు దర్శనమిచ్చే అనంత్ అంబానీ భారీకాయంతో అందర్నీ ఆకట్టుకునేవాడు. ఈ కుర్రాడు ముఖేష్ అంబానీ కుమారుడు అని తెలియడంతో అంతా చిత్రంగా చూసేవారు. ఊబకాయంతో భాధపడుతున్న అనంత్ ను చూసి పలు సందర్భాల్లో జోకులు కూడా పేలాయి. ఆ తరువాత అనంత్ చాలా కాలం బయట కనపడలేదు. అతని అన్న ఆకాశ్ అంబానీ మాత్రం ముంబై ఇండియన్స్ జట్టుతో సందడి చేసేవాడు. ఈ క్రమంలో తాజాగా అనంత్ తో దిగిన ఫోటోను సచిన్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అంతా ఎవరో అనుకోవడంతో అనంత్ సోదరుడు ఆకాశ్ అంబానీ తన తమ్ముడి శారీరక మార్పును సూచిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిని చూసిన వారంతా షాక్ తిన్నారు. అమెరికన్ ఫిజికల్ ట్రైనర్ వద్ద వైద్యుల సహాయంతో ప్రాక్టీస్ చేసిన అనంత్ అంబానీ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. భారీ కాయుడిగా విమర్శలకు నెలవైన అనంత్ సినిమా హీరోలా నాజూగ్గా మారి ఆకట్టుకుంటున్నాడు. చిన్నతనంలో అస్తమాతో బాధపడ్డ అనంత్ దాని చికిత్సకు వాడిన మందులతో ఊబకాయుడిగా తయారయ్యాడు. ఇలా అయితే భవిష్యత్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న వైద్యుల సూచనతో చికిత్స తీసుకున్నాడు. జంతు ప్రేమికుడైన అనంత్ యూఎస్ లోని బ్రౌన్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నాడు.

  • Loading...

More Telugu News