: విశాఖలో ఘోరరోడ్డు ప్రమాదం...11 మంది మృతి?


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం జిల్లా నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై టైరు పేలడంతో అదుపుతప్పిన ఓ కారు, అటుగా వచ్చిన ఓ బైక్ ను ఢీ కొట్టి, ఓ లారీ కిందికి దూసుకెళ్లింది. భారీ పైపుల లోడుతో వెళ్తున్న లారీ కిందికి కారు చొచ్చుకుపోవడంతో కారు నుజ్జునుజ్జైంది. ఈ సమయంలో కారులో తొమ్మిది మంది ఉన్నట్టు సమాచారం, కారు నుజ్జునుజ్జవడంతో ఇందులో ఏ ఒక్కరూ బతికి బయటపడే అవకాశం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇదే ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరూ దుర్మరణం పాలైనట్టు వారు వెల్లడించారు. దీంతో ఈ ఘటనలో మొత్తం 11 మంది మరణించినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News