: 'ప్రత్యూష నా దగ్గర డబ్బులు తీసుకునేది' అంటున్న పని మనిషి


హిందీ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు ఇప్పుడు హత్య కేసుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆత్మహత్యకు గురైందని చెబుతున్న ప్రత్యూష బెనర్జీ తీవ్ర హింసకు గురై మరణించిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ స్పష్టం చేస్తుండగా, ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులంతా ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగే ఆమెను హత్య చేశాడని అనుమానిస్తున్నారు. మరోవైపు మరణానికి ముందు ఆమె అకౌంట్ నుంచి 23 లక్షల రూపాయలు మాయం అయినట్టు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. కాగా, ప్రత్యూష ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న రేణూసిన్హా కీలక విషయాలు వెల్లడించింది. మూడు నెలల క్రితం ప్రత్యూష ఇంట్లో తాను పనికి కుదిరినట్టు చెప్పింది. ఈ మూడు నెలల్లో పలు సందర్భాల్లో తక్కువ మొత్తంలో ప్రత్యూష తన వద్దనుంచి నగదు అప్పుగా తీసుకున్నారని ఆమె చెబుతోంది. ప్రత్యూష వద్ద ఖర్చులకు కూడా డబ్బులు ఉండేవి కాదని, ఆర్థిక సంబంధమైన విషయాలన్నీ రాహుల్ చూసుకునేవాడని ఆమె తెలిపింది. పలు సందర్భాల్లో వారింటి నుంచి అరుపులు వినిపించేవని ఆమె చెప్పింది. అర్ధరాత్రి సమయాల్లో ఆమె ఏడ్చేదని, రాహుల్ బయటకు వెళ్లిపోయాక గొడవలకు కారణాలు చెప్పుకుని ప్రత్యూష బాధపడేదని ఆమె వెల్లడించింది. తన మాజీ బాయ్ ప్రెండ్స్ ను గుర్తుచేసి కొట్టేవాడని ఆమె చెప్పిందని రేణు సిన్హా తెలిపింది. పలు సందర్భాల్లో ఆ గొడవలు అడ్డుకోవాలని అనిపించినా, వారి వ్యక్తిగత జీవితంలో కలుగ చేసుకోకూడదని మిన్నకుండిపోయానని చెప్పింది. సినిమా, షాపింగ్ లాంటి చిన్న చిన్న కోరికలకు కూడా రాహుల్ అభ్యంతరం చెప్పేవాడని, పలు సందర్భాల్లో రాహుల్ మాజీ ప్రేయసి వచ్చి ప్రత్యూషను నానా దుర్భాషలాడి వెళ్లేదని ఆమె చెప్పింది.

  • Loading...

More Telugu News