: కేరళ అగ్నిప్రమాద బాధితులను పరామర్శించనున్న రాహుల్ గాంధీ


కేరళ కొల్లంలోని పుట్టంగళ్ ఆలయ అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ బయలుదేరుతున్నారు. నేటి సాయంత్రం ప్రమాద ఘటనా స్థలికి చేరుకుని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు. ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీతో ఎప్పటికప్పుడు ఫోన్ లో టచ్ లో ఉంటూ, బాధితులకు అందుతున్న సహాయకచర్యలపై ఆరాతీస్తున్నారు. అవసరమైన సలహాలు ఇస్తున్నారు. కాగా, ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా వంటి ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

  • Loading...

More Telugu News