: ప్రస్తుత రాజకీయాలు చూస్తే సిగ్గేస్తోంది: బొత్స


ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే సిగ్గేస్తోందని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాదులో లోటస్ పాండ్ లో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం విలువలు కలిగిన రాజకీయాలు లేవని అన్నారు. చట్టాలను రాజకీయపార్టీలు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. అధికారం చేపట్టిన పార్టీ ఇతర పార్టీలకు చెందిన నేతలను పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పార్టీ మారిన నేతలకు కండువా కప్పి ఆహ్వానించలేదని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి నేరుగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని ఆయన పేర్కొన్నారు. చట్టాలమీద పాలకులకే గౌరవం లేకపోవడం దారుణమని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News