: అనుపమ్ ఖేర్ కు శ్రీనగర్ ఎయిర్ పోర్టులో చుక్కెదురు!
శ్రీనగర్ ఎన్ఐటీలో స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య గొడవలు జరుగుతున్న వేళ, విద్యార్థులను పరామర్శించడానికంటూ శ్రీనగర్ చేరుకున్న బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు ఎయిర్ పోర్టులో చుక్కెదురైంది. విద్యార్థులను కలిసేందుకు అనుపమ్ ను అనుమతించబోమంటూ ఎయిర్ పోర్టులోనే పోలీసులు నిర్బంధించారు. ఆయన బయటకు వెళ్లేందుకు భద్రతాదళాలు అనుమతించక పోగా, వారితో అనుపమ్ వాగ్వాదానికి దిగారు. వర్శిటీకి అనుపమ్ ఖేర్ వెళితే, పరిస్థితి విషమిస్తుందన్న ఆందోళన ఉందని శ్రీనగర్ పోలీసువర్గాలు వెల్లడించాయి. అందుకే ఆయన్ను అడ్డుకున్నట్టు తెలిపాయి.