: మెదక్ జిల్లాలో కలకలం... తుపాకులతో తిరుగుతున్న యూపీ గ్యాంగ్ అరెస్ట్
తుపాకులతో తిరుగుతున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ ముఠా మెదక్ జిల్లాలో పోలీసులకు పట్టుబడటంతో కలకలం రేగింది. జిల్లా పరిధిలోని సంగునూరు మండలంలోని రాంపూర్ దాబా వద్ద ఏదో గొడవ జరుగుతోందన్న సమాచారం మేరకు వెళ్లిన పోలీసులకు వీరు చిక్కడం గమనార్హం. పోలీసులు వస్తున్నారని చూసిన గ్యాంగులోని ముగ్గురు పరారయ్యారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా, వారివద్ద మూడు తుపాకులు లభ్యమయ్యాయి. వీరిని స్టేషనుకు తరలించి విచారిస్తున్న పోలీసులు, తప్పించుకున్న ముగ్గురి కోసం జిల్లా అంతటా సోదాలు నిర్వహిస్తున్నారు.