: క్రేన్ తో షిఫ్ట్ చేస్తుండగా బేగంపేటలో కూలిన విమానం!


హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. వాడుకలో లేని ఓ పాత విమానాన్ని దుండిగల్ కు క్రేన్ సాయంతో తరలిస్తుండగా, అది తిరుమల తిరుపతి దేవస్థానం పాఠశాల ప్రహరిగోడపై కుప్పకూలింది. పాత ఎయిర్ పోర్టు వెనుకవైపు రోడ్డు వద్ద ఈ తెల్లవారుఝామున ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దుండిగల్ లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు ఉపయుక్తకరంగా ఉంటుందని దీన్ని తీసుకువెళ్లేందుకు అన్ని అనుమతులూ తీసుకున్నామని, విమానాన్ని మోస్తున్న క్రేన్ జారడం వల్లే విమానం కింద పడిందని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News