: తొలి సినిమాకే డబ్బింగ్ చెబుతున్న మీనా కూతురు నైనిక


త్వరలో విడుదలకు సిద్ధమైన 'తేరి' (తెలుగులో పోలీసోడు) చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించిన నటి మీనా కుమార్తె నైమిక, తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతూ, అందరినీ ఆకట్టుకుందట. నైమిక డబ్బింగ్ చెబుతున్న దృశ్యాన్ని సినిమా దర్శకుడు అట్లీ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. వెనకాల మీనా నవ్వుతూ చూస్తుండగా, మైకు ముందు నైమికను ఒళ్లో కూర్చోబెట్టుకుని డబ్బింగ్ చెప్పిస్తున్న చిత్రాన్ని అట్లీ తన అభిమానులతో పంచుకున్నాడు. విజయ్ హీరోగా, సమంత, ఎమీ జాక్సన్ లు హీరోయిన్లుగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

  • Loading...

More Telugu News