: మిస్ ఇండియా 2016 ప్రియదర్శినీ చటర్జీ


ఎఫ్బీబీ ఫెమీనా మిస్ ఇండియా 2016గా ప్రియదర్శినీ చటర్జీ ఎంపికయ్యారు. ఫైనల్ పోటీలు అత్యంత ఆనందోత్సాహాల మధ్య ముంబైలో జరుగగా, పోటీలో ఉన్నవారందరినీ వెనక్కు నెట్టిన ప్రియదర్శినీ సగర్వంగా అందాల కిరీటాన్ని అందుకున్నారు. రెండవ స్థానంలో సుశృతీ కృష్ణ, మూడవ స్థానంలో పంఖూరీ గిద్వానీలు నిలిచారు. అంతకుముందు బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, తన తాజా చిత్రం 'ఫ్యాన్' లోని 'జబ్రా ఫ్యాన్' గీతానికి వేదికపై ఆడారు. మిస్ ఇండియా కావడానికి క్వాలిటీస్ ఏంటి? నీకే ఎందుకు కిరీటం తొడుగుతారని భావిస్తున్నావు? అన్న ప్రశ్నకు, "మిస్ ఇండియా తనకు తాను నిజాయతీగా ఉండాలి. తానెవరన్నది ప్రతిబింబించే వ్యక్తిత్వం కలిగివుండాలి. నా వ్యక్తిత్వం అటువంటిదే. అందువల్ల నేనే తదుపరి మిస్ ఇండియాను అవుతాను" అని సమాధానం చెప్పి విజేతగా నిలిచారు.

  • Loading...

More Telugu News