: అనుకోని దుర్ఘటన... పరిస్థితి ఘోరం: ఉమన్ చాందీ
పుట్టింగల్ దేవి ఆలయంలో జరిగిన ప్రమాదం అత్యంత ఘోర దుర్ఘటనగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమన్ చాందీ అభివర్ణించారు. ఈ ప్రమాదం తనను కలచి వేసిందని తెలిపారు. ఈ ఉదయం విషయం తెలుసుకున్న ఆయన, మిగతా అన్ని అధికారిక కార్యక్రమాలనూ రద్దు చేసుకుని కొల్లాం చేరుకున్నారు. "దుర్ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. ఇక గాయపడిన వారికి అత్యుత్తమ చికిత్సను అందించడంపై దృష్టిని సారించాం" అని వివరించారు. మృతుల సంఖ్యపై మరింత స్పష్టత రావాల్సి వుందని తెలిపారు. కాగా, బాణసంచా పేలి జరిగిన ప్రమాదంలో 75 మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి.